ముగించు

అసిస్టెంట్ డైరెక్టర్, వికలాంగుల సంక్షేమం, TG & SC అన్నమయ్య జిల్లా

సహాయ సంచాలకులు విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల సంశేమ శాఖ, అన్నమయ్య జిల్లా  వారి ద్వారా ఈ క్రింద కనపరచిన  పధకములు అమలు చేస్తున్న పధకముల వివరములు .

వికలాంగుల పునరావాసము (సబ్సిడీ)

వికలాంగులకు బ్యాంకు ఋణము తో కలిపి సబ్సిడీ గా  50 శాతము (రూ.1,00,000) మించకుండా మంజూరు చేయబడును. యాన్.సి / యస్.టి.లతో సమనాముగా 21 సంవత్స్రముల లోపుగా ఉండాలి. 

ప్రత్యక నియామకము క్రింద విభిన్న ప్రతిభావంతులు  బ్యాక్ లాగ్  ఉద్యోగాలు 

ట్రాన్స్ జెండర్స్ :  ట్రాన్స్ జెండర్స్ కు జిల్లా లోని  ప్రభుత్వ ఆసుపత్రి నందు  వైద్య  పరిక్షలు  నిర్వహించి మెడికల్ సర్టిఫికేట్  ఇచ్చుటకు అవకాశము కలదు. 

 జిల్లాలో విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల కు  పునరావాస కేంద్రములు  మంజూరు చేయుటకు అవకాశము కలదు.

జిల్లా మేనేజర్ ఆంధ్ర ప్రదేశ్ విభిన్న ప్రతిభావంతుల మరియు వయో వృద్దుల సహాయ  సంస్థ  అన్నమయ్య జిల్లా  ద్వారా అమలు చేస్తున్న పథకములు.

ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతుడు మరియు వయో వృద్దులు  వారికి కావలసిన పరికరములు పొందుటకు జిల్లా కేంద్రములోని కార్యాలయమునకు రాకుండా , సమీపములోని మీ సేవ మరియు ఏ.పి. ఆన్ లైన్ కేంద్రములో  పరికరములు మరియు ఉపకరణములకు www.apdascac.ap.gov.in అను వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు  చేసోకొన్నచో వారి ధరఖాస్తును పరిశిలించి, అభ్యర్ధి  ఇచ్చిన ఫోన్ ద్వారా సంప్రదించి , మంజూరు చేయుటకు కొరకు తగు చర్య గైకోనబడునని తెలియజేయాడమైనది. 

  1. అమలు చేస్తున్న పధకములు.
  2. మూడు చక్రముల సైకిళ్ళు
  3. తోపుడు బండ్లు (వీల్ చైర్)
  4. మోట రైజేడ్ వెహికల్ 
  5. చంక కర్రలు 
  6. క్యాలిపర్స్:
  7. లాప్ టాప్స్ :
  8. టచ్ ఫోన్స్ 
  9. అంధులకు చేతికర్రలు
  10. వినికిడి యంత్రము