భూగర్భ జల శాఖ మరియు జల గణన శాఖ
సూచనా దృశ్యం:-
- భూగర్భ జల మరియు జల గణన శాఖ 1971 సంవత్సరంలో ఏర్పాటై , చిన్న నీటి పారుదల పధకాలు అమలు చేయు ఆర్ధిక సంస్ధలకు భూగర్భ జల విశ్లేషణ మరియు తగు సిపారసులు రాష్ట్రంలో అందచేయుచున్నది. మొదట ఈ శాఖ రాష్ట్ర సచివాలయంలో చిన్న కార్యాలయంగా ఏర్పాటై తదుపరి కేంద్ర భూగర్భ జల సంస్ధ తరహాలో విస్తరించినది. మొదట ఐదు సంవత్సరాలు కేంద్ర భూగర్భ జల సంస్ధ మరియు భారత భూగర్భ జల పరిశోదన సంస్ధలకు సంబందించిన అధికారులు సారధ్యం వహించారు .
- ఈ శాఖ భూగర్భ జల వనరుల అభివృద్ధి మరియు యాజమాన్యం నిర్వహణకై పలు విభాగాములతో కూడినది. ఈ శాఖ, జల వనరుల శాఖ లో ఒక్కటై రాష్ట్ర స్థాయీలలో సంచాలకులు, జిల్లా స్థాయీలలో జిల్లా భూగర్భ జల అధికారి సారధ్యం వహిస్తారు.
- ఈ శాఖ త్రవ్వకాపు బావులు, బోర్ బావులు , ఫిల్టర్ బావులు ఇసుక రేవులు మొదలగు పధకాలు అమలు చేయు వివిధ సంస్ధలకు సర్వే నిర్వహించి సిఫారస్సులు చేస్తుంది. ఈ శాఖ ఆంధ్ర ప్రదేశ్ వాల్ట చట్టం 202-2004 ప్రకారం షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన కులాల అభివృద్ధి సంస్ధలకు గ్రామీణ త్రాగు నీటి సరఫరా శాఖ, ఉద్యానవన శాఖ, పట్టు పరిశ్రమల శాఖ, పరిశ్రమల శాఖలకు, రైతులకు, గృహస్తులకు భూగర్భ జల సర్వేయ్ నిర్వహించి తగు సిఫారస్సులు చేఉచున్నది.
- నీటి పారుదల, పంచాయత్, జిల్లా నీటి యాజమాన్య, అటవీ మొదలగు శాఖలకు కృతిమ భూగర్భ జల రిచార్జ్ నిర్మాణాల కొరకు సర్వే నిర్వహించి స్థల ఎంపిక చేస్తుంది. భూగర్భ జల నిల్వలను, వినియోగం, మిగులు (వాటర్ షెడ్) గ్రామాల వారీ వర్గీకరణ (అత్యధిక/సంక్లిష్ట/పాక్షిక సంక్లిష్ట/సురక్షిత వినియోగం) నియతకాల పరిమితులలో అంచనా చేస్తుంది.
- పిజోమీటర్లు,పరిశీలక బావులు ద్వార ఆయకట్టు, అరకట్టేతర ప్రాంతాలలో భూగర్భ జల మట్టాలనుసేకరిస్తూ, భూగర్భ జల నాణ్యతను కూడా విశ్లేషణ చేస్తుంది.
- వాల్ట చట్టం 2002-2004 అమలులో జిల్లా యంత్రాగానికిఈ శాఖ సాంకేతిక సహాయ సహకారాలు అందిస్తుంది.
- షెడ్యూల్ కులాల, షెడ్యూల్ తేగల లబ్దిదారులుకు ఉప ప్రణాళిక ద్వార బోర్ బావుల నిర్మాణం చేపడుతుంది.
ముఖ్య / ప్రధాన విధులు:-
- భూగర్భ జల వనరుల గణన నిర్ణిత కాలములో చేపడుతుంది.
- అధిక భూగర్భ జల నిల్వల ప్రాంతాలను గుర్తిస్తుంది.
- బావుల / బోర్ బావుల / పిజోమీటర్లు/రిచార్జ్ నిర్మాణాలు / ప్రయోగాత్మక బోర్ బావుల డ్రిల్లింగ్ కొరకు స్థల ఎంపిక చేస్తుంది.
- చిద్రణ యంత్రాల (రిగ్గు) నమోదు.
- భూగర్భ జల మట్టాల సేకరణ మరియు జల నాణ్యతవిశ్లేషణ.
- మిశ్రమ (ఉపరితల – భూగర్భ) నీటి వినియోగ అధ్యయము.
- భు ఉపరితల చాయ చిత్రం ఉపగ్రహ చిత్రాల విశ్లేషణ.
- నీటి పరివాహక ప్రాంతాల మరియు కృతిమ రిచార్జ్నిర్మాణాలవిశ్లేషణ.
- ఇతర ఆర్ధిక సహాయ సంస్ధ పధకాలు .
- హైడ్రాలాజి ప్రాజెక్ట్ ఫేస్ -I, ఫేస్ -II మరియు ఫేస్ -III
- ఆంధ్ర ప్రదేశ్ నవికృత నీటి పారుదల మరియు వ్యవసాయ పరివర్తన పధకం.
- ఎత్తిపోతల పధకం స్థల ఎంపిక
- పరిశ్రమల/గనులుకు పర్యావరణ అనుమతులకు సర్వే.
- ఇసుక క్వారీ ద్వార భూగర్భ జలలపై కలుగు ప్రభావాన్ని అధ్యయనం
- ఆంధ్ర ప్రదేశ్ వాల్ట చట్టం అమలులో సాంకేతిక సహాయం అందించుట
- భూగర్భ జల నివేదికలు, చిత్రాల తయారీ మరియు అందుబాటులో ఉంచుట.
- భూగర్భ జల యాజమాన్యపద్దతులపై అవగాహనా కల్పించుట.
- కృత్రిమ రిచార్జ్నిర్మాణాలప్రభావాన్ని అధ్యయనం చేయుట.
- గ్రా,గ్రామాల వారి భూగర్భ జల వనరుల అధ్యయనము /అంచనానీటి గణన
- చేపల /రొయ్యల చెరువల (ఆక్వాకల్ట్చర్) సాంకేతిక అనుమతుల కై సర్వే
- పరిశ్రమల/గనుల అవసరాలకు భూగర్భ జల వినియోగంకై నిరభ్యంతరం పత్రం కొరకు సర్వే.
- తీర ప్రాంతంనందు సముద్ర జల చొరబాటు పై అధ్యయనం
- భూగర్భ జల అన్వేషణలో నూతన సాంకేతిక / యాంత్రిక వినియోగం పై ఈ శాఖలో క్షేత్ర స్థాయీ అధికారులకు తగు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించుట
- కరువుపై జిల్లా అధికారులకు సాంకేతికనివేదిక సమర్పించుట
- సాంకేతిక పరంగానే కాక జిల్లా అధికారుల సూచనా మేరకు ప్రభుత్వ పరిపాలన పరంగా ఎన్నికలు, పరిక్షలు, ప్రకృతి విలయం మోదలకు సమయములో విధులు నిర్వర్తించుట.