ముగించు

జిల్లా విపత్తు నిర్వహణ

జిల్లా విపత్తు నిర్వహణ 

          ప్రకృతిలో ఆకస్మాతుగా సంభవించే పరిణామాల వలన జరిగే అపార నష్టం , వినాశనాలను “విపత్తు”గా పరిగణిస్తారు .  

విపత్తు నిర్వహణ :

లభ్యమగు వనరులను సంస్థాగతం చేసి అత్యవసర పరిస్థుతులలో మానవీయ విలువలతో బాధ్యతలను నిర్వర్తించుటలో విపత్తు సమయంలో ప్రధానంగా స్పందించి నష్టాలను తగ్గించు ప్రక్రియను ” విపత్తు నిర్వహణ ” అంటారు.

జిల్లాలో ఈ క్రింది ప్రకృతి విపత్తులు సంభవించే అవకాశం ఉంది.

  •       కరువు
  • వరదలు / భారీ వర్షాలు
  • వడగాలులు                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                                 

కరువు:

అనావృష్టి మరియు సాధారణం కంటే తక్కువ వర్షపాతము కరువుకు ప్రధాన కారణము. ముఖ్యముగా సకాలములో వర్షాలు పడక పోవడం, సుధీర్ఘ పొడి వాతావరణం, నీటి వనరులు ఎండిపోయి నీటి సరఫరా లేకపోవడం, పంటలు ఎండి పోవడం, జంతువులు చనిపోవడం, పోషకాహార-లోపం మరియు అనారోగ్యకరమైన వాతావరణం వంటివి కరువు వలన ఏర్పడును. భూగర్భ-జలాల మట్టం తగ్గిపోవటం, భూమి క్షారవంతం కావటం, వాతావరణం మరియు నీరు కాలుష్యమవడం వలన ప్రాంతీయంగా కొన్ని జంతు జాతులు అంతరించటం వంటి పరిణామాలు కలుగును.

కరువుకు సంబంధించి ప్రధానంగా వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్ధక, గ్రామీణ నీటి సరఫరా, ప్రజారోగ్యం, స్త్రీ మరియు శిశు సంక్షేమ, పౌర సరఫరా, భూగర్భ జలాలు, గ్రామీణాభివృద్ధి సంబంధిత శాఖలు కరువు పరిస్థితుల నుండి బయట పడేందుకు వివిధ చర్యలు చేపడతారు.

వరద / భారీ వర్షాలు:

ప్రకృతి విపత్తు నిర్వహణ విభాగం వరదలను దిగువ విధంగా నిర్వచించారు. “నదీ పరివాహక ప్రాంతాలలో భారీ వర్షాలు, అధిక గాలులు, తుఫానులు వంటి పరిస్థితుల వలన జలాశయంలో నీటి మట్టం పెరగడం, తీరం వెంబడి తుఫాను, సునామి మరియు మంచు లేదా ఆనకట్ట పేలుళ్లు  ద్వారా తాత్కాలికంగా ఎక్కువ ప్రాంతాలలో జరిగే నష్టంగా నిర్వచించింది. అంతే కాక భూమి మునిగిపోయేలా విస్తారంగా నీరు ప్రవహించడాన్ని కూడా వరదగా నిర్వచించవచ్చును.

  • 2001, 2005, 2009, 2010, 2015 మరియు 2021 సంవత్సరములలో జిల్లాలో భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి.
  • అగ్నిమాపక సేవా సిబ్బంది రక్షణ మరియు పునరావాస కార్యకలాపాల్లో పాల్గొని, అనేక మందిని రక్షించి, నివాస గృహాలు, కార్యాలయాలు మరియు ఇతర నివాస భవనాల నుండి నీటిని తోడి వేశారు. అగ్నిమాపక శాఖ ఫైర్ ఇంజన్ల ద్వారా ప్రజలకు త్రాగునీటిని సరఫరా చేశారు.   
    • 2018 మార్చి 30న, శ్రీ కోదండరామస్వామి కళ్యాణోత్సవం సందర్భంగా ఒంటిమిట్ట మండలంలో భారీ గాలులు వీచి, సిమెంట్ రేకులు మీద పడటం కారణంగా నలుగురు (4) వ్యక్తులు మరణించగా, 39 మంది గాయపడ్డారు.
    • మరుసటి సంవత్సరం (2019)లో, ఆ దురదృష్టకర సంఘటన మరల పునరావృత్తం కాకుండా జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగినది. ముందుజాగ్రత్త చర్యగా ఎన్.డి.ఆర్.ఎఫ్ (NDRF) Rescue బృందాలను పిలిపించడం జరిగినది. వాతావరణం అనుకూలించడంతో స్వామి వారి కళ్యాణం ప్రశాంతంగా జరిగింది.  NDRF బృందం చేత Mock Drills నిర్వహింప చేసి, విపత్తులు ఎదురైనప్పుడు ఎలా ఎదుర్కోవాలో ప్రజలలో ముఖ్యంగా విద్యార్థులకు అవగాహనా కల్పించడం జరిగింది. అగ్నిమాపక శాఖ వారు కుడా పాల్గొని అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఏ విధంగా సమయస్పూర్తితో వ్యవహరించి ప్రమాదాలను నివారించవచ్చునో అవగాహన కల్పించారు.

     

              సుధీర్ఘ కాలం అసాధారణమైన వేడి వాతావరణం కొనసాగడం వలన వీచే వేడి గాలులను “వడ గాలులు” గా పరిగణిస్తారు. వడ గాలుల కారణంగా ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని పొందుతారు. అంతేకాక కొన్ని సందర్భాలలో ప్రాణాలు కోల్పోవడం కూడా జరుగుతుంది.

              జిల్లాలో వేసవిలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండటం వలన వేడి గాలులు వీచటం సర్వ సాధారణం. వడగాలి ప్రభావాన్ని ప్రజల మీద తగ్గించడానికి, వడగాలుల నుండి రక్షింపబడటానికి / తట్టుకోవటానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి జిల్లాలో ఈ క్రింది చర్యలు సంబంధిత శాఖల ద్వారా చేపట్టబడుచున్నవి.

    • పలు ప్రాంతాలలో చలి వెంద్రాల ఏర్పాటు
    • గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో  ట్యాంకర్ ద్వారా త్రాగు నీటి సరఫరా.
    • ప్రజలకు ఉచితంగా మజ్జిగ సరఫరా.
    • వైద్య మరియు ఆరోగ్య శాఖ ద్వారా గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో అవగాహన శిభిరాలు మరియు వైద్య శిభిరాలను నిర్వహించడం.
    • వేసవిలో “చేయదగిన” మరియు “చేయకూడని” పనులు (Do’s & Dont’s) గురించి కర పత్రాలు, పోస్టర్ల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించడం. జిల్లాలోని ప్రముఖ స్థలాల్లో పోస్టర్లను అతికించటం / ప్రదర్శించటం.

    విపత్తు సంసిద్దత:

    విపత్తు సంసిద్దత యొక్క ప్రధాన పరికరాలు క్రింది శాఖల వద్ద అందుబాటులో ఉన్నాయి.

    • అగ్నిమాపక శాఖ
    • మత్స్య శాఖ
    • వైద్య మరియు ఆరోగ్య శాఖ

    వడ గాలులు:

  • జిల్లా అగ్నిమాపక కార్యాలయములో అందుబాటులోనున్న ఫోమ్ టెండర్లు, అడ్వాన్సు టెండర్లు, వాటర్ టెండర్లు, మిస్ట్ జీపులు, మిస్ట్ బుల్లెట్లు, ఫైర్ రూట్స్ మొదలైనవి సకాలంలో విపత్తు నివారించడానికి ఉపయోగిస్తారు.
  • వరదల సమయంలో బాధితులకు సహాయ పడటానికి మత్స్య శాఖ గజ ఈతగాళ్ళతో పాటు లైఫ్ జాకెట్లు మరియు నాటు పడవలతో సిద్దంగా ఉంది.
  • వైద్య మరియు ఆరోగ్య శాఖ విభాగాలు మందు మరియు ప్రధమ చికిత్స వస్తు సామగ్రిని సరఫరా చేస్తాయి. స్పైన్ బోర్డులు, స్ట్రెచర్, ఇంక్యుబెటర్, పోర్టబుల్ వెంటిలేటర్లు మొదలైనవి అత్యవసర సమయంలో ఆరోగ్య శాఖ సరఫరా చేస్తాయి. వివిధ శాఖల ద్వారా విపత్తులను ఎదురుకోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్దంగా ఉన్నది.